చంద్రబాబు కుమారుడిగా రాజకీయ తెరంగేట్రం చేసిన నారా లోకేష్ ఇప్పుడు పార్టీని భవిష్యత్ లో నడిపించే స్థాయిలో ఉంటాడని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. కాగా ఆయనకు ఆ స్థాయిలో మాత్రం జనాధరణ కరువైంది. ఎందుకంటే లోకేష్ జనాలను ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ అవుతోంది. కాగా ఈ క్రమంలోనే లోకేష్ కూడా తన వ్యవహారాన్ని అలాగే లాంగ్వేజ్ స్టైల్ ను పూర్తిగా మార్చేసుకుని ప్రతి విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల ఇప్పుడు తెలుగు తమ్ముల్లు కొంత మురిసిపోతున్నారు.
కానీ లోకేష్ మాత్రం తన స్థాయికి తగ్గ రాజకీయాలు చేయట్లేదని అంతా అంటున్నారు. ఎందుకంటే ఆయన ఎంత సేపు కేవలం పరామర్శలకే వెళ్తున్నారని అవి కాకా మిగతా విషయాలపై పెద్దగా పోరాడట్లేదని అంతా అంటున్నారు. ఇక ఆయన ఇలా వెళ్తున్న ప్రతి సారి కూడా ఆయన వ్యూహాలను వైసీపీ దారుణంగా దెబ్బ కొడుతోంది. ఇందుకు మొన్నటికి మొన్న గుంటూరులో రమ్య విషయమే కనిపిస్తోంది.
ఆయన రమ్య కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లి పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాగా ఆయన చేసిన విమర్శలక చెక్ పెట్టేందుకు జగన్ ప్రభుత్వం రమ్య కుటుంబానికి కొన్ని హామీలు ఇవవ్డంతో వారు కూడా జగన్ ప్రభుత్వాన్ని పొగిడేస్తున్నారు. తమకు జగన్ సర్కారు ఫుల్ సపోర్టుగా ఉందన్నారు. కాబట్టి ఎంతసేపు లోకేశ్ ఇలాంటి పరామర్శలు మానేసి పోరాటాలపై దృష్టి పెట్టాలని అంతా కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిన అంశాలపై పోరాడాలని కోరుతున్నారు తమ్ముళ్లు.