మన’లోకం’ నిజం :  మోడి vs ట్రంప్ విషయం లో అసలు జరిగింది ఏంటి !

-

కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందు గేమ్ చేంజర్‌గా అభివర్ణించారు. ఈ మందు వల్ల దాదాపు కరోనా వైరస్ ని అరికట్టవచ్చని చెప్పుకొచ్చారు. ఈ హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇండియాలో ఎక్కువగా మలేరియా ను కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఎగుమతి చేసే దేశంగా భారత్ కి మంచి పేరు ఉంది. దాదాపు నెలకి ఇరవై కోట్ల మాత్రలు తయారు చేస్తోంది. ఇటువంటి నేపథ్యంలో కరోనా వైరస్ వచ్చిన సందర్భంలో కేంద్ర వైద్య బృందం హైడ్రాక్సీక్లోరోక్వీన్ అనే ఈ డ్రగ్ కరోనా విషయం లో ఒక వండర్ డ్రగ్ అని… దీన్ని ఎగుమతులు ఆపేసి దేశ ప్రజల కోసం నిల్వ ఉంచితే బాగుంటుంది అని మోడీకి మార్చి నెలలోనే చెప్పడంతో మార్చి 25 వ తారీకున హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఎగుమతులను కేంద్రం ఆపేయటం జరిగింది.అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ అమెరికాలో గట్టిగా ఉండడంతో.. రోజుకి కొన్ని వందల మంది మరణాలు సంభవించడం తో పాటు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో డోనాల్డ్ ట్రంప్ కన్ను హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందు పై పడింది. అయితే ఈ మందు ఎక్కువగా భారత్ ఎగుమతి చేయడంతో ఇటీవల ప్రధాన మోడీ కి ఫోన్ చేసి అమెరికా కి హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందులు పంపించాలని ట్రంప్ కోరటం జరిగింది. మోడీతో మాట్లాడిన వెంటనే అమెరికా అధ్యక్షుడు మీడియా సమావేశం పెట్టి  భారత్ ప్రధాని మోడీ హైడ్రాక్సీక్లోరోక్వీన్ డ్రగ్ అమెరికాకి పంపిస్తారని చెప్పారని డోనాల్డ్ ట్రంప్ పొగడటం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే… మోడీ…డోనాల్డ్ ట్రంప్ కి కచ్చితమైన సూచన ఇవ్వకముందే మీడియా సమావేశం పెట్టి కామెంట్లు చేశారట.

 

ఒక పక్క మోడీ కేంద్ర వైద్య అధికారులతో చర్చలు జరపకుండానే డోనాల్డ్ ట్రంప్ ఆ విధంగా మాట్లాడటంతో.. మోడీ ఒక్కసారిగా షాక్ తిన్నారట. దీంతో ఈ విషయంలో మోడీ చొరవ తీసుకుని డోనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి దేశంలో పరిస్థితిని వివరించిన తర్వాత మానవ దృక్పధంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ ని అమెరికా కి పంపడానికి రెడీ అవుతున్నట్లు చెప్పుకోచ్చారట. ఇదే టైం లో భారత్ పై దాడి చేస్తామని డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోడీ చర్చించారు అని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి.

 

మామూలుగా అయితే అమెరికాలో కరోనా వైరస్ వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో డోనాల్డ్ ట్రంప్ కి ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి అమెరికాలో కూడా లాక్ డౌన్ అమలు చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారట. అయితే అప్పట్లో మోడీ సూచన పక్కన పెట్టిన డోనాల్డ్ ట్రంప్.. తాజాగా ఇండియా దగ్గర డ్రగ్ అడిగి, ఇండియా ని బెదిరించేటట్లు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తప్పు పట్టారట మోడీ. మొత్తంమీద చూసుకుంటే ఇండియాలో కూడా వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ ని ముందు జాగ్రత్తగా మోడీ ఇతర దేశాలకు ఎగుమతులు ఆపేసి నిల్వ ఉంచడం స్టార్ట్ చేయడంతో డోనాల్డ్ ట్రంప్ మోడీ వైఖరిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version