ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది మనలోకం.కామ్. దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గాన్ని సర్వే కోసం ఎంచుకున్నాం. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరుపున ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి నారా లోకేశ్ పోటీ చేస్తున్నారు. మరి.. మీ ఓటు ఎవరికి.
మంగళగిరిలో టఫ్ ఫైటే
టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో వైసీపీ నుంచి గెలిచారు. ఆయనకు 88,977 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవికి 88,965 ఓట్లు వచ్చాయి. అంటే.. కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల మంగళగిరిలో గెలిచారు. అంటే.. మంగళగిరిలో వచ్చే ఎన్నికల్లోనూ టఫ్ ఫైటే ఉండనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే.. ఆళ్లకు మంగళగిరిలో మంచి పేరు ఉంది. ఆయన మంగళగిరిలో చాలా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇప్పటికే 4 రూపాయల భోజనం పథకం, 10 రూపాయలకే సంచి నిండా కూరగాయలు అందించడం లాంటి కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు. మంగళగిరిలో చేనేత కార్మికులు, ముస్లింల ఓట్లు ఎక్కువ. వీళ్లు ఎటువైపు మళ్లితే వాళ్లదే విజయం.
[IT_EPOLL id=”27849″][/IT_EPOLL]
ఓటు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు.. ఆ హక్కును అమ్ముకోవద్దు.. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండి..