మారుతీ రావు… ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అమృత తండ్రి ఆత్మహత్య కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేసారు. అతని ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. అతను గత నెల రోజులుగా ఎవరితో మాట్లాడాడు, అతనిని ఎవరు కలిసారు, అమ్రుతతో ఏమైనా మాట్లాడాడా…? తమ్ముడు, లేదా ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు ఏమైనా తలేత్తాయా…? ఎవరైనా అతనిని ఒత్తిడి చేసారా అనే దానిపై పోలీసులు విచారణ ముమ్మరం చేసారు.

ఈ నేపధ్యంలో అతని ఆస్తి వివరాలను పోలీసులు కోర్ట్ కి సమర్పించారు. ఆయన ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం చూస్తే దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసారు. కిరోసిన్ డీలర్ గా ఆయన తన జీవితం మొదలుపెట్టారని ఆ విధంగా రైస్ మిల్ వ్యాపారంలోకి అడుగుపెట్టి… ఆ తర్వాత 15 ఏళ్ల క్రితం రైస్‌మిల్లులు అన్నీ అమ్మేసి రియల్ ఎస్టేట్ లోకి అడుగుపెట్టి తన తమ్ముడి తో కలిసి ఆయన వ్యాపారం చేసారు.

శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో మారుతీరావు, అతడి సోదరుడు శ్రవణ్ దాదాపు వంద విల్లాల వరకు అమ్మినట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఇక ఆయనకు మిర్యాలగూడలో అమృత హాస్పిటల్ పేరుతో వంద పడకల ఆస్పత్రి, అక్కడే అతడి భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి, మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో 22 గుంటల భూమి, మిర్యాలగూడ, ఈదులగూడెం రోడ్‌లో షాపింగ్‌మాల్స్, మారుతీరావు తల్లి పేరు మీద రెండంతస్తుల షాపింగ్‌మాల్, హైదరాబాద్‌లోని కొత్తపేటలో 400 గజాల ప్లాట్, వేర్వేరు చోట్ల 5 అపార్టుమెంట్లు ఉన్నాయని కోర్ట్ కి తెలిపారు.