మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భద్రత పెంపు

-

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మర్డర్ ప్లాన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రూ.15 కోట్లు సుపారీ ఇచ్చి హత్య చేసేందుకు స్కెచ్ వేశారు. అయితే పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. దీంతో అలెర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం.. మంత్రికి మరింత భద్రతను పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మరికొంత  భద్రతా సిబ్బందిని పెంచింది. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు రెండు పైలెట్ వాహనాలతో పాటు 20 మంది భద్రతా సిబ్బందిని కేటాయించింది. అంతకుముందు మంత్రికి ఒక పైలెట్ వాహనంతో పాటు 10 మంది భద్రతా సిబ్బంది మాత్రమే ఉండే వారు. 

మంత్రి మర్డర్ ప్లాన్ ను సైబరాబాద్ పోలీసులు చేధించారు. మొత్తం ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులందరిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు అన్యాయం చేశారని… తమపై అక్రమ కేసులు పెట్టించారని, తన కూతురు మరణానికి కారణమయ్యాడనే కారణంతోనే మంత్రిని హత్య చేయాలని అనుకున్నట్లు నిందితులు అంగీకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version