కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. అధిష్టానికి లేఖ రాసిని విషయం తెలిసిందే. కాగ ఈ రాజీనామా విషయంలో తాను వెనక్కి తగ్గుతున్నట్టు జగ్గారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జగ్గరెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండబోనని కూడా ప్రకటించారు.
తనను కోవర్ట్ అని సొంత పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బహిరంగంగానే జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే సోమవారం రాత్రి రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అయిన విషయం తెలిసిందే. కాగ ఈ సమావేశం అనంతరం.. జగ్గారెడ్డి తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నాని ప్రకటించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తాను పని చేస్తానని ప్రకటించారు. రాహుల్ గాంధీని చూసిన తర్వాత గతంలో తాను ఏం మాట్లాడానో మర్చి పోయానని అన్నారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు.