ఎమ్మెల్సీ ఫలితాలు రివర్స్ లో వచ్చిన నేపథ్యంలో కొందరు మంత్రుల పదవులు పోతాయా? నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా పోయే అవకాశం ఉందా? అంటే ఉందనే చెప్పవచ్చు. ఇటీవలే కేబినెట్ సమావేశంలో జగన్..కొందరు మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, కొందరు మంత్రులు సరిగా పనిచేయడం లేదని, అలాంటి వారిని తప్పించడానికి వెనుకాడనని, అవసరమైతే ఒకరిద్దరికి సీట్లు కూడా ఇవ్వనని చెప్పేశారు.
ఇప్పటికే జగన్ వార్నింగ్ ఇచ్చారంటే..ఇప్పుడు ఎమ్మెల్సీ ఫలితాలు మంత్రులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ప్రాంతాల్లో మంత్రులకు చిక్కులు తప్పేలా లేవు. ఎందుకంటే ఆ రెండు స్థానాలని టిడిపి కైవసం చేసుకుంది. దీంతో సీన్ రివర్స్ అయింది. అసలు విశాఖ రాజధాని కాన్సెప్ట్ తో ఉత్తరాంధ్రలో తమదే హవా అని వైసీపీ భావించింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అక్కడ మంత్రులుగా ఉన్నవారికి కొత్త చిక్కులు వచ్చాయి.
బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, అప్పలరాజు, రాజన్న దొర మంత్రులుగా ఉన్నారు. ఇక వీరిలో జూనియర్లు అయిన గుడివాడ, అప్పలరాజులకు రిస్క్ ఎక్కువ కనిపిస్తుంది. పైగా అప్పలరాజు అవినీతి అంటూ పోస్టల్ బ్యాలెట్లలో రాశారంటే పరిస్తితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటు తూర్పు రాయలసీమలో మంత్రులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ ఉన్నారు..వీరిలో నారాయణస్వామికి రిస్క్ ఎక్కువ కనిపిస్తుంది.
అటు పశ్చిమ రాయలసీమలో కూడా రిజల్ట్ తేడా కొట్టేలా ఉంది. అదే జరిగితే అక్కడ ఉన్న మంత్రులకు రిస్క్ తప్పదు..మరి చివరికి జగన్ ఏ మంత్రికి చెక్ పెడతారో చూడాలి.