రాజకీయ పార్టీలకు సవాల్ గా మారుతున్న స్వతంత్ర్య అభ్యర్దులు.. తెలంగాణాలో మొదలైన ఎన్నికల వేడి..

-

తెలంగాణలో అసెంబ్లీ, పార్టమెంట్ ఎన్నికలు ముగిశాయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రభావాన్ని చూపాయి.. అయితే మరో రసవత్తరమైన ఎన్నికకు తెలంగాణ వేదిక కాబోతోంది.. కరీంనగర్ ఎమ్మెల్సీ పదవికాలం ముగియనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు సీరియస్ గా దృష్టిపెట్టాయి..

ఓ వైపు ప్రధాన పార్టీలు అభ్యర్దుల కోసం వేట ప్రారంభించాయి.. మరోపక్క స్వతంత్య్ర అభ్యర్దులు పోటీకి సిద్దమవుతున్నారు.. టిక్కెట్ఇస్తే పార్టీల తరపున పోటీ చెయ్యడం లేదంటే.. స్వతంత్ర్యంగా పోటీ చేసే సత్తా చాటాలని ఇండిపెండెంట్ అభ్యర్దులు సిద్దమవుతున్నారు.. దీంతో కరీంగనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గరంగతరం పాలిటిక్స్ వేదిక కాబోతున్నాయి.. కరీంనగర్ సెగ్మెంట్ నుంచి పట్టభద్రుల ప్రతినిధిగా ఈసారి ప్రాతినిధ్యం వహించేది ఎవరనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి..

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి జీవన్ రెడ్డి గెలుపొందారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దక్కించుకున్న స్థానాన్ని.. మరోసారి తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది..అయితే అభ్యర్ది ఎవరనేదానిపై ఇంకా అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు.. ఎవరు పోటీచేసినా.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం..

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పరిధిలో బిజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. ఆ స్తానాన్ని చేజిక్కించుకోవాలని ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తోంది.. ఈటెల, కేంద్రమంత్రి బండి సంజయ్ వంటి సీరియర్లు కసితో ఉన్నారు.. బిఆర్ఎస్ కూడా పట్టు నిలుపుకునేందుకు తహతహలాడుతోంది.. ఈ ప్రధాన పార్టీలకు స్వతంత్ర్య అభ్యర్దులు కూడా తలనొప్పులుగా మారారు.. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తెలంగాణాలో స్టాట్ అయింది..

Read more RELATED
Recommended to you

Latest news