ఇటీవల జరిగిన దేశ వ్యాప్త సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. నిన్న రాత్రి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీచే ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో పలువురు ఎంపీలు కూడా కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేశారు. అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు మోదీ ఇవాళ పలు శాఖలను కేటాయించారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. రాజ్‌నాథ్ సింగ్ (రక్షణ శాఖ)
2. అమిత్ షా (హోం శాఖ)
3. నితిన్ గడ్కరీ (రోడ్డు, రవాణా, రహదారుల శాఖ)
4. సదానంద గౌడ (కెమికల్ అండ్ ఫర్టిలైజర్ (ఎరువులు,రసాయనాలు) శాఖ)
5. నిర్మలా సీతారామన్ (ఆర్థిక శాఖ)
6. రామ్ విలాస్ పాశ్వాన్ ( ఆహార, పౌర సరఫరాల శాఖ)
7. నరేంద్ర సింగ్ తోమర్ (వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్)
8. రవిశంకర్ ప్రసాద్ (న్యాయ శాఖ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ)
9. హర్ సిమ్రత్ కౌర్ బాదల్ (ఫుడ్ ప్రాసెసింగ్)
10. థావర్ చంద్ గెహ్లాట్ (సామాజిక న్యాయ శాఖ)
11. డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్ (విదేశీ మంత్రిత్వ శాఖ)