మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తన తండ్రి హత్య కేసులో పలు అనుమానాలు ఉన్నాయంటూ, వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఆమె పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ హత్య కేసులో తనకు వీరిపై అనుమానాలు ఉన్నాయంటూ ప్రస్తావించిన పేర్లలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉంది.
ఆయనతో పాటుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. ఇక ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ ఆమె హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఎన్నికల సమయంలో జరిగిన ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
దీనిపై అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రి ఆదినారాయణ రెడ్డి సహా ప్రస్తుత ఎమ్మెల్సీ బీటెక్ రవి పై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు వీరిద్దరినీ కూడా సీట్ ప్రత్యేకంగా విచారించింది. వివేకా హత్యకేసులో కొందరిపై అనుమానాలున్నాయంటూ హైకోర్టులో రిట్ వేశారు. ప్రత్యేకమైన ఆరోపణలేవీ చేయడంలేదంటూనే తమకు అనుమానాలున్నాయంటూ కొందరి పేర్ల జాబితా హైకోర్టుకు ఆమె సమర్పించారు.
సునీత పేర్కొన్న జాబితాలో ఉన్న పేర్లు:-
వాచ్‌మన్ రంగయ్య
ఎర్ర గంగిరెడ్డి
వైఎస్ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి
పరమేశ్వర్‌రెడ్డి
శ్రీనివాసరెడ్డి
వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి
వైఎస్ మనోహర్‌రెడ్డి
వైఎస్ అవినాష్‌రెడ్డి
సీఐ శంకరయ్య
ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి
ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి