ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ మృతిపై అతని తల్లిదండ్రులు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. CRPFలో పని చేస్తున్న హరీష్ సోదరుడు వచ్చేవరకు డెడ్ బాడీని తీసుకెళ్లమని మృతుడి బంధువులు స్పష్టంచేశారు.
అయితే, ఎస్సై హరీశ్‌కు పెళ్లి నిశ్చయం కాకముందే సోషల్ మీడియాలో పరిచయమైన నల్గొండ జిల్లాకు చెందిన యువతితో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు సమాచారం. చాలా కాలంగా వీరిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎస్సైకు పెళ్లి నిశ్చయం కావడంతో ఆ విషయం తెలిసినప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు పేరెంట్స్ అనుమానిస్తున్నారు. ఆ యువతి వేధింపుల కారణంగానే తన కొడుకు సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.
ఇదిలాఉండగా, యువతికి, ఎస్సైకి మధ్య మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఎస్సై సూసైడ్ చేసుకున్నట్లు సీఐ బండారు కుమార్ తెలిపారు.