ఏపీ మంత్రి నారాయణకు, టీడీపీకి నెల్లూరులో ఎదురుదెబ్బ

-

ఏపీలో వలసలు ఇంకా తగ్గట్లేవు. ఇంకా టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు 14 రోజుల సమయమే ఉంది. అయినప్పటికీ వలసల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలోకి చేరారు.

తాజాగా మంత్రి నారాయణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తోడల్లుడు రామ్మోహన్ వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వైఎస్సార్సీపీ నేతలు అదాల ప్రభాకర్ రెడ్డి, అనిల్ కుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈసందర్భంగా అదాల ప్రభాకర్ రెడ్డి… రామ్మోహన్ కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.



టీడీపీ ప్రభుత్వ పాలన నచ్చకే వైసీపీలో చేరా..

టీడీపీ ప్రభుత్వ పాలన నచ్చకనే వైసీపీలో చేరానని రామ్మోహన్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాను 5000 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి నారాయణ చెప్పడానికి రామ్మోహన్ తప్పుపట్టారు. నెల్లూరు జిల్లాను నిజంగానే అంత డబ్బు పెట్టి ఖర్చు చేస్తే ఇప్పుడు మళ్లీ డబ్బులు ఇచ్చి ఓట్లను ఎందుకు అడుక్కుంటున్నారంటూ మండిపడ్డారు. రామ్మోహన్ రాకతో నెల్లూరు జిల్లాలో వైసీపీ మరింత బలపడినట్టేనని అదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంత్రి నారాయణ విధానాలు నచ్చకనే చాలామంది టీడీపీని వీడుతున్నారని అదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version