ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం మొదలైందో అప్పటినుంచి..అక్కడ బీజేపీకి పాజిటివ్ అంశాలు పెరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు బీజేపీ బలం పెరిగే రాజకీయం నడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే దిశగా బీజేపీ చేస్తున్న రాజకీయం దాదాపు సక్సెస్ అవుతుంది. అలాగే బీజేపీకి రివర్స్ చెక్ పెట్టే క్రమంలో కేసీఆర్ చేసే రాజకీయం కూడా…అనూహ్యంగా బీజేపీకే కలిసొస్తుంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ అనూహ్యంగా బీజేపీకి కొత్త ఆయుధాలు అందిస్తుంది.
ఇప్పటికే తెలంగాణ కోసం పోరాడిన వారిని టీఆర్ఎస్ పక్కన పెట్టిందని, తెలంగాణ ద్రోహులతో టీఆర్ఎస్ నిండిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకునేందుకు చూస్తుంది. అదే సమయంలో బీజేపీకి చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ ఇతర పార్టీల మద్ధతు తీసుకుతుంది. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న టీఆర్ఎస్ అనూహ్యంగా మునుగోడు ఉపఎన్నిక కోసం కమ్యూనిస్టుల మద్ధతు తీసుకుంది. తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న సిపిఐ, సిపిఎంల మద్ధతు కేసీఆర్ తీసుకున్నారు.
అంటే కేసీఆర్‌ని బీజేపీ ఎక్కడ వరకు తీసుకొచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. కమ్యూనిస్టులు మాత్రమే కాదు…అటు ఎంఐఎం సపోర్ట్ కూడా బీజేపీకి ఉంది. 2014 నుంచి పరోక్షంగా ఎంఐఎం మద్ధతు టీఆర్ఎస్కు ఉంది. ఆ మధ్య జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా ఎంఐఎం సపోర్ట్‌తోనే టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకుంది. సరే ఈ పార్టీలే కాదు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా టీఆర్ఎస్కు సపోర్ట్ ఇస్తుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కలుస్తాయని ప్రచారం జరుగుతుంది.
అయితే బలం పెంచుకోవడం కోసం కేసీఆర్..ఇతర పార్టీల మద్ధతు తీసుకుంటున్నారు. కానీ ఇదే అంశం బీజేపీకి బాగా ఉపయోగపడుతుంది. బీజేపీ సింగిల్‌గా పోరాడటం కలిసొచ్చే అంశం. టీఆర్ఎస్ ఏమో ఇతర పార్టీల మద్ధతు తీసుకుంటుందని కానీ బీజేపీ సింగిల్‌గా పోరాడుతుందని జనాల్లో సానుభూతి పెరగవచ్చు. కాబట్టి దీనిపై ఫోకస్ చేసి..టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తే బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. సింగిల్ గా పోరాడే పార్టీలని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు.