కర్నూలు వైసీపీలో కొత్త రచ్చ… రోడ్డు మీదే కొట్టుకున్నారు…!

అవుకు మండలం చనుగొండ్ల లో వైఎస్ఆర్సిపి లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరస్పరం వైసిపి నాయకులు పోటీ చేసుకున్నారు. వీదిలో నడిచి వెళుతుండ గా చల్లా వర్గీయులు కాపు కాచి దాడి చేశారని కాటసాని వర్గీయులు ఆరోపిస్తున్నారు. బైరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , వెంకట సుబ్బమ్మ అనే ఇద్దరికి గాయాలు అయినట్టు పోలీసులు తెలిపారు.

బనగాన పల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అని వివరించారు. దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి వర్గం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గాలుగా వైసీపీ శ్రేణులు జిల్లాలో ముందుకు వెళ్తున్నాయి. దీనితో చనుగొండ్లలో భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. ఈ ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రికి కూడా ఎమ్మెల్యే వర్గం ఫిర్యాదు చేసింది.