ఎక్కడైనా రాజకీయాల్లో మంత్రులు అనేవారు బాగా హైలైట్ అవుతారు…అసలు సీఎం తర్వాత వారే ప్రజలకు తెలుస్తారు…కానీ ఏపీలో మాత్రం చాలా విచిత్రంగా ఉంది…కేవలం జగన్ వన్ మ్యాన్ షో నడవడం వలనో…లేక మంత్రులే ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారో తెలియడం లేదు గాని..చాలామంది మంత్రులు అనే సంగతి ప్రజలకు తెలియడం లేదు. అయితే కొద్దో గొప్పో ముందు మంత్రులుగా పనిచేసిన వారు కాస్త జనాలకు తెలిశారు…కానీ కొత్తగా వచ్చిన వారు మాత్రం మంత్రులు అనే సంగతి ప్రజలకు తెలియడం లేదు. అసలు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ఎవరు ఏ శాఖ మంత్రి అనేది కూడా తెలియడం లేదు
మిగిలిన పాత, కొత్త మంత్రులు అసలు మంత్రులనే సంగతి ప్రజలకు తెలియడం లేదు. ఉషశ్రీచరణ్, జయరాం, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు, రాజన్న దొర లాంటి వారు మంత్రులనే సంగతి తెలియడం లేదు. ఇక హోమ్ మంత్రి వనిత గురించి జనాలకు తెలియడం లేదు. అలాగే సీనియర్ మంత్రులైన ధర్మాన ప్రసాద్ రావు, బొత్స లాంటి వారు పెద్దగా హైలైట్ కావడం లేదు. మొత్తానికి కొత్త మంత్రులు హైలైట్ అవ్వాలసిన అవసరముంది.