ప్రముఖ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మన దేశ ప్రధాని మోడీ (narendra modi) ని విమర్శిస్తైస్తూ ఓ న్యూస్ రావడం కలకలం రేపింది. న్యూయార్క్ టైమ్స్ లో గురువారం పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్రాయగల ప్రచారక జర్నలిజం గురించి ఓ ఆర్టికల్ రాయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
భారతదేశంలో నిరుద్యోగులు పెరుగుతున్నారని, ఉద్యోగ బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని తెలిపింది. అంతే కాదు భారత ప్రభుత్వం జనాభా విపరీతంగా పెరుగుతున్నా దాని గురించి పట్టించుకోవట్లేదని తెలిపింది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దు వివాదాలతో రాజకీయాలు చేస్తోందని తెలిపింది.
కాగా దీనిపై ప్రభుత్వ సలహాదారు అయిన కాంచన్ గుప్తా గురువారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత ప్రజల ద్వారా ఎన్నికైన ప్రధానిపై ఇలాంటి న్యూస్ రాయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పారు. ఇలాంటి వార్తలు విద్వేషాన్ని రెచ్చగొడుతాయని చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పద్ధతిని బట్టి చూస్తే అది విదేశీ స్వచ్ఛంద సంస్థల విరాళాలతో ఇలాంటి వార్తలు రాస్తొందని మండిపడ్డారు. మోడీ పొరుగు దేశాలను కూడా ప్రేమిస్తారని తెలిపారు.