జాతిని ఉద్దేశించి నేడు ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పిఎంఓ కార్యాలయం ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సినేషన్ పైఈ ప్రసంగంలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశంలో కరోనా రెండో దశ ఉధృతి, వ్యాక్సిన్లు కొరతపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశంలో వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు కేంద్రం విదేశీ వ్యాక్సిన్ లకు మరి కొన్ని మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ వ్యాక్సిన్ లపై ప్రధాని మోడీ ఈరోజు ప్రసంగంలో కీలక ప్రకటన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాయంత్రం ప్రధాని మోడీ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.