ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న హాట్ సీట్లలో నిర్మల్ ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. ఇక్కడ రాజకీయ పోరు ఎప్పుడు రసవత్తరంగానే సాగుతుంది. అయితే చాలా ఏళ్ల నుంచి నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డిదే పై చేయి అన్నట్లు ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి సత్తా చాటిన ఇంద్రకరణ్..2014లో బిఎస్‌పి నుంచి గెలిచారు. ఆ తర్వాత బిఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు.
ఇక 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలిచి మరోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే వరుసగా గెలవడంతో ఇంద్రకరణ్‌కు నిర్మల్ లో పూర్తి స్థాయి అనుకూల వాతావరణం లేదు. కాస్త వ్యతిరేకత ఉంది. కానీ ఈ క్రమంలో కాంగ్రెస్, బిజేపిల్లో జరిగిన పరిణామాలతో సీన్ మారింది. మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి..ఊహించని విధంగా బిజేపిలోకి వచ్చారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలు కారణంగా ఏలేటి కాంగ్రెస్‌ని వదిలి బిజేపిలోకి వచ్చారు. ఎలాగో అక్కడ బిజేపికి సరైన నాయకుడు లేరు.
దీంతో ఏలేటికి నిర్మల్ సీటు ఖాయమైంది. అంటే ఆయన బిజేపి నుంచి పోటీ చేయడం ఖాయమే. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి పడే కొన్ని ఓట్లు ఏలేటి వల్ల బిజేపికి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఇంద్రకరణ్ రెడ్డికి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో బిఆర్‌ఎస్ లో కూడా కొందరు అసంతృప్త నేతలు ఉన్నారు. వారు ఇంద్రకరణ్‌కు వ్యతిరేకంగా రాజకీయం నడిపిస్తున్నారు.
నిర్మల్ బిఆర్‌ఎస్ కీలక నేత శ్రీహరిరావు..ఇంద్రకరణ్‌కు యాంటీగా ఉన్నారు. ఆయన..రేవంత్ రెడ్డికి టచ్ లోకి వచ్చినట్లు సమాచారం.ఆయనకు కాంగ్రెస్ సీటు ఆఫర్ చేసినట్లు తెలిసింది. అదే జరిగితే నిర్మల్ లో రసవత్తర పోరు జరిగే ఛాన్స్ ఉంది. మరి ఈ సారి నిర్మల్ లో పై చేయి ఎవరిదో చూడాలి.