హమ్మయ్యా.. కసరత్తు స్టాటైంది.. ఇక పదవుల పందేరమే..

-

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది.. నామినెటెడ్ పదవుల కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్న నేతలకు తెలంగాణ కాంగ్రెస్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది.. ఎవరెవరికి ఏయే పదవులు ఇవ్వాలి.. ఎవరికి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయానికి వస్తున్నారు.. దీంతో త్వరలోనే భర్తీ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది..

కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి ఏడాది కావొస్తోంది.. కొందరిని నామినెటెడ్ పదవులు దక్కినా.. మరికొందరు సీనియర్లకు ఎలాంటి పదవి రాకపోవడంతో నిరాశతో ఉన్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో పార్టీ కోసం పనిచేస్తే.. తమను ప్రభుత్వ పెద్దలు గుర్తించడంలేదన్న అభిప్రాయం నేతల్లో ఉంది.. కొందరు మంత్రులవద్ద తమ గోడు వెళ్లబోసుకుంటూ ఉండగా..మరికొందరు నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే కలిసి తమకు పదవులు ఇవ్వాలంటూ కోరుతున్నారు..

మహారాష్ట, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం బిజిగా గడిపింది.. దీంతో తెలంగాణలో పదవుల భర్తీపై దృష్టి పెట్టలేదు.. మహారాష్టలో ఎన్నికల సంగ్రామం ముగిసింది.. జార్ఖండ్ లో కూడా తొలి విడత ముగియడంతో.. తెలంగాణ రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ, నామినెటెడ్ పదవుల భర్తీ వంటి వాటిపై హస్తిన నేతలు దృష్టి పెట్టారు..
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు దఫాలుగా డిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికాఖర్గేలను కలిసి.. ఆశావాహుల జాబితాతో పాటు.. సీనియర్ల జాబితాను వారికి అందజేశారు.. ఈ మేరకు వారికి ఇవ్వాల్సిన పదవులపై కూడా క్లారిటీ వచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది..

ఈ క్రమంలో నామినెటెడ్ పదవులపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.. సీఎం రేవంత్ రెడ్డితో ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ బట్టి విక్రమార్క, పీసీసీ చీప్ మహేష్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.. వారు నామినెటెడ్ పదవులపై చర్చించారట.. డిసెంబర్ లో పదవుల పందేరం ఉంటుందని.అందులో భాగంగానే ఈ భేటీ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. దీంతో ఆశావాహుల మళ్లీ తెరమీదకు వచ్చారు.. తమ కష్టాన్నిగుర్తిస్తారో లేదో అంటూ తెగ టెన్షన్ పడుతున్నారట.. డిసెంబర్ లోపు జాబితాను సిద్దం చేసి.. వారికి పదవులు కట్టబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.. ఈసారైనా సవ్యంగా జరుగుతుందో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news