గత ఎన్నికల్లో ఘోర ఓటమితో పోలిస్తే.. ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్తితి మెరుగైందనే చెప్పొచ్చు. ఈ రెండున్నర ఏళ్లలో టీడీపీ చాలావరకు పుంజుకుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.. వైసీపీని డామినేట్ చేసే స్థాయి కాకపోయిన కొంతవరకు పార్టీ పరిస్తితి మెరుగైంది. అలాగే గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు ఇప్పుడు చాలావరకు పుంజుకున్నారు. ఇక టీడీపీలో ఉన్న మహిళా నేతలు సైతం కూడా పికప్ అయ్యారని చెప్పొచ్చు.
గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ఒక్క మహిళా నేత మాత్రమే విజయం సాధించారు. ఆదిరెడ్డి భవాని మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. మిగిలిన మహిళా నేతలంతా ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడుప్పుడే వారు పికప్ అవుతున్నారు. చాలామంది మహిళా నేతలు రేసులోకి వచ్చారు. పలాసలో గౌతు శిరీష, సాలూరులో గుమ్మడి సంధ్యారాణి, విజయనగరంలో అతిథి గజపతి రాజు, పాయకరావుపేటలో వంగలపూడి అనిత.. ఇలా పలువురు నాయకురాళ్ళు రేసులోకి వచ్చారు.
అయితే ఇంకా కొందరు నేతలు పికప్ అవ్వాలి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ, గౌరు చరితారెడ్డిలు ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో అఖిల.. ఆళ్లగడ్డ బరిలో, చరితా.. పాణ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. భారీ మెజారిటీలు తేడాతోనే ఈ ఇద్దరు ఓడిపోయారు. అయితే ఈ రెండున్నర ఏళ్లలో వారు పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.. వైసీపీపై పోరాడుతున్నారు.
కాకపోతే వీరు ప్రత్యర్ధులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల అఖిల-చరితాలకు ఛాన్స్ దొరకడం లేదు. పాణ్యంలో ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అక్కడ ఆయనని ఓడించడం అంత ఈజీ కాదు. ఇటు ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి సైతం స్ట్రాంగ్‌గా ఉన్నారు. కాబట్టి ఆళ్లగడ్డలో అఖిలకు అంతగా ఛాన్స్ రావడం లేదు. మరి చూడాలి ఎన్నికల నాటికైనా ఇద్దరు నేతలు పుంజుకుంటారేమో.