చంద్రశేఖరుని ‘ఓల్డ్’ పాలిటిక్స్… ‘జీరో’ బెనిఫిట్?

-

తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ రాజకీయ వ్యూహాలు పన్నడంలో ధిట్ట అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన వ్యూహాలకు ఎలాంటి ప్రత్యర్ధికి అయినా చెక్ పడాల్సిందే. తన గురువైన చంద్రబాబుకే చంద్రశేఖర్ చెక్ పెట్టారు. తన పదునైన వ్యూహాలతోనే రెండో సారి అధికారంలో కొనసాగుతున్నారు. అయితే రెండోసారి అధికారంలో కొనసాగుతున్న కే‌సి‌ఆర్ వ్యూహాలు ఈ మధ్య గాడి తప్పుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటివరకు తన వ్యూహాలతో ప్రత్యర్ధులని ఎదగనివ్వలేదు. కానీ ఇప్పుడు అన్నీ రివర్స్ అవుతున్నాయి…ప్రత్యర్ధులు ధీటుగా పుంజుకుంటున్నారు.

KCR-TRS

అయినా సరే కే‌సి‌ఆర్ ఇంకా సరైన వ్యూహాలు పన్నుతున్నట్లు కనిపించడం లేదు. అదే ఓల్డ్ పాలిటిక్స్ చేస్తూ ముందుకెళుతున్నారు. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటారు….అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది అన్నివేళలా వర్కౌట్ అవ్వదు. కానీ కే‌సి‌ఆర్ మాత్రం అదే ఫార్ములాతో ముందుకెళుతున్నారు. ఇప్పుడు తన పాత మిత్రులని కే‌సి‌ఆర్ కలుపుకుని బలపడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కానీ ఆ లక్ష్యంగా పెద్దగా నెరవేరేలా కనిపించడం లేదు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టాలని చెప్పి…ఈ మధ్య పలు పార్టీలకు చెందిన నాయకులని టి‌ఆర్‌ఎస్‌లోకి తీసుకున్నారు. అందులో భాగంగా టి‌టి‌డి‌పి అధ్యక్షుడు ఎల్ రమణని సైతం టి‌ఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చారు. అలాగే సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుని కూడా పార్టీలోకి తీసుకోనున్నారు.

అందుకే తాజాగా కే‌సి‌ఆర్..మోత్కుపల్లిని తన వెంట అసెంబ్లీకి కూడా తీసుకొచ్చారు. మోత్కుపల్లి టి‌ఆర్‌ఎస్‌లో చేరిన వెంటనే…కే‌సి‌ఆర్ దళిత బందు చైర్మన్‌గా మోత్కుపల్లిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మోత్కుపల్లిని కే‌సి‌ఆర్ బాగా పెద్దగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. మోత్కుపల్లి వచ్చినంత మాత్రాన టి‌ఆర్‌ఎస్‌కు పెద్దగా ఓట్లు రావు. ఎందుకంటే మోత్కుపల్లి అవుట్‌డేటెడ్ నాయకుడు అయిపోయారు. కనీసం మోత్కుపల్లి వల్ల తన సొంత సామాజికవర్గానికి చెందిన దళితుల ఓట్లు కూడా పడవు.

అయినా సరే మోత్కుపల్లిని పార్టీలోకి తీసుకొచ్చి, అందలం ఎక్కిస్తే ఏదో ఒరిగిపోతుందని కే‌సి‌ఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అటు రమణ వల్ల కూడా టి‌ఆర్‌ఎస్‌కు పావలా ఉపయోగం లేదనే చెప్పొచ్చు. మోత్కుపల్లి, రమణలు అంటే ఒకప్పుడు ప్రజలు ఆదరించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదు…కొత్త తరం నాయకులు వచ్చేశారు. ఇలాంటి సీనియర్లకు ప్రజల్లో పెద్ద ఆదరణ లేదు. ఏదో సలహాలు, సూచనలు వరకు పనికొస్తారు గానీ నాలుగు ఓట్లు తెచ్చి పెట్టడంలో మాత్రం ఉపయోగం లేదు.

గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్‌లో కవితని గెలిపించుకోవాలని చెప్పి కే‌సి‌ఆర్…మండవ వెంకటేశ్వరరావు, సురేష్ రెడ్డిలని టి‌ఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చారు. కానీ వారి వల్ల ఏం ఉపయోగం లేదు. కవిత ఓటమి పాలయ్యారు. మండవ, రమణ, సురేష్, మోత్కుపల్లి లాంటి వారు గొప్ప నాయకులే…కానీ అది ఒకప్పుడు…ఇప్పుడు కాదు. వీరి వల్ల టి‌ఆర్‌ఎస్‌కు ‘జీరో’ బెనిఫిట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version