ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో – అసలేం జరిగిందో తెలిస్తే ఊపిరి ఆగిపోద్ది ఏమో !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఎన్నికల ముందు రాజకీయాలు చేయడం జరిగింది. ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్ మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం రాష్ట్రాన్ని అన్యాయం చేసిందని ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని కచ్చితంగా తాము అధికారంలోకి వస్తే తీసుకొస్తాం అని అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది.

అయితే తాజాగా ఇటీవల జరిగిన పార్లమెంటు సభ లో ప్రత్యేక హోదా గురించి అధికార పార్టీ వైసీపీ పార్టీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించగా దానికి కేంద్ర ప్రభుత్వం అది ముగిసిన అధ్యాయము అని ఇకనుండి దేశంలో ఉన్న ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో ప్రత్యేక హోదా వస్తుందని చాలామంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆశలు పెట్టుకోకు కేంద్రం ఇచ్చిన తాజా ఈ ప్రకటనతో ఊపిరి ఆగిపోయినట్లు అయింది.

ప్రత్యేక హోదా వల్ల అనేక పరిశ్రమలు రాయితీలు రాష్ట్రానికి వస్తాయని ఎన్నికల సమయంలో ప్రకటించిన జగన్ సర్కార్ కి తాజాగా కేంద్రం ఇచ్చిన ప్రకటనతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. జగన్ అధికారంలోకి రావడంతో అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా గ్యారెంటీగా వస్తుందని ఊపిరిపీల్చుకున్న రాష్ట్ర ప్రజానీకం తాజాగా…కేంద్రం ఇచ్చిన స్టేట్మెంట్ ఏపీ ప్రత్యేక హోదా పై ఆశలు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ ఎంపీలు కూడా సరిగ్గా ఈ విషయంపై మాట్లాడటానికి మీడియా ముందుకు రావటం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version