పట్టాభి రీ-ఎంట్రీ…మళ్ళీ అదే దారిలో?

-

ఇటీవల టీడీపీ నేత పట్టాభి…గంజాయి విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ…సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిలని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలపై ఎలాంటి రచ్చ నడిచిందో అందరికీ తెలిసిందే. ఇక జగన్‌ని అసభ్య పదజాలంతో దూషించారని చెప్పి, పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయడం ఆ వెంటనే…బెయిల్‌పై బయటకురావడం…నెక్స్ట్ పట్టాభి కనబడకుండా మాల్దీవులకు వెళ్ళడం జరిగాయి. దీంతో కొన్ని రోజుల పాటు ఏపీలో పట్టాభి హడావిడి కనబడలేదు.

మళ్ళీ చాలా రోజుల తర్వాత పట్టాభి మీడియా ముందుకొచ్చారు….యథావిధిగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పెట్రోల్, డీజిల్‌లపై కేంద్రం వ్యాట్ తగ్గిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. దేశంలోనే అత్యధికంగా పెంచిన రాష్ట్రం ఏపీనేనని, ఈ ఏడాది కాలంలో పెట్రోల్‌పై రూ.7.59 పైసలు, డీజిల్‌పై రూ.5.48 పైసలు పెంచిందని పట్టాభి ఫైర్ అయ్యారు.

ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయడంలో, నిజాలను నిర్భయంగా మాట్లాడటంలో తాను వెనక్కి తగ్గబోనని తాను క్రమశిక్షణ గల పసుపు సైనికుడినని, ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా, భయపడబోనని చెప్పారు. అలాగే తాను ఎప్పుడు నోరు జారలేదని మాట్లాడారు. అంటే మాట్లాడిన మాటకు పశ్చాత్తాపం పడుతున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఎప్పుడూ నోరు జారలేదని అంటున్నారు. మీడియాలోనే కదా…జగన్‌ని బోసిడికే అని తిట్టింది..ఆ విషయం అందరూ చూశారు. అయినా సరే పట్టాభి నోరు జారలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇకపై పట్టాభి మీడియా సమావేశాలు పెట్టడం, జగన్‌ని విమర్శించడం మళ్ళీ జరగనున్నాయి. ఇక ఆయన మాటలకు అడ్డు అదుపు ఉండదని అర్ధమవుతుంది. అసలు తప్పుగా మాట్లాడననే పశ్చాత్తాపం పట్టాభి మొహంలో కనబడటం లేదు. యథావిధిగానే మళ్ళీ నోరు వేసుకుని పడిపోవడం మొదలుపెట్టేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version