టిడిపి- జనసేన పొత్తుతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ పవన్ ఘాటైన విమర్శలు చేస్తుంటారు. టిడిపి- జనసేన మధ్య పొత్తుల కుదరటంతో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఏ స్థానాలు జనసేన పోటీ చేస్తుంది, ఏవి కావాలని టిడిపిని అడుగుతుంది అనే అంశం హాట్ టాపిక్ అయింది.
ఇదే సమయంలో పవన్.. జగన్ సొంత జిల్లా అయిన కడపపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో పవన్ ఎన్ని సీట్లు కోరతారనేది ఆసక్తికరంగా మారింది. బద్వేలు, రాజంపేట సీట్లు జనసేనకు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. కానీ జనసేన మైదుకూరు కూడా కావాలంటున్నారని సమాచారం. రాజంపేట అసెంబ్లీ పవన్ కు సామాజికపరంగా పట్టున్న నియోజకవర్గం. ఇక్కడి నుండి పోటీ చేస్తే గెలుపు సునాయాసం అవుతుందని జనసేన వర్గాలు అంటున్నాయి.
ఇక్కడి నుండి పోటీ చేయడానికి జనసేన తరఫున అభ్యర్థులు కూడా సిద్ధంగానే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన అధికారి వై శ్రీనివాసరాజు ఈ రాజంపేట నుంచి టికెట్ ఆశిస్తుంటే, మరో యువ నాయకుడు దినేష్ కూడా తనకు టికెట్ కావాలని ఆశిస్తున్నాడు. మరి అధినేత ఎవరికి ఇస్తారు వేచి చూడాలి.
బద్వేలు, రాజంపేట, మైదుకూరు ఈ మూడు స్థానాలు జనసేన పార్టీకి ఇస్తారా? లేదా ఏదైనా ఒకటి రెండు స్థానాలు ఇస్తారా? అని ఇరు పార్టీల పార్టీలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. అలాగే పొత్తులో తీసుకుని సీట్లలో జనసేన గెలిచి కడపలో పాగా వేస్తుందేమో చూడాలి.