ఏపీ రాజకీయాల్లో బలం పెంచుకోవాలని పవన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు..అయితే పూర్తి స్థాయిలో ప్రయత్నం లేకపోవడం వల్ల జనసేన బలం పెరగడం లేదు. ఏదో గత ఎన్నికల్లో 6 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు ఓ 3 శాతం పెరిగి 9వరకు వచ్చిందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ 9 శాతంతో పవన్ సీఎం అయిపోతారా? రాజకీయంగా సత్తా చాటుతారా? అంటే అబ్బే కష్టమనే చెప్పాలి. సింగిల్ గా పోటీ చేస్తే పట్టుమని పది సీట్లు గెలుచుకోలేరు.
అంటే జనసేన బలం అలా ఉంది..పూర్తి స్థాయిలో జనసేన బలం పెరగడం లేదు. కేవలం 10 శాతం ఓట్లు పైనే బలం ఉన్న జిల్లాలు విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరులోనే మిగిలిన జిల్లాల్లో జనసేనకు బలం లేదు. అలా అని ఆ ఐదు జిల్లాల్లో జనసేన సత్తా చాటాడడం కష్టమే. ఆశలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వీక్ అవుతున్నప్పుడే పవన్..జనసేన బలం పెంచాల్సింది. కానీ పవన్ ఆ పని చేయలేదు.
ఇప్పుడేమో టీడీపీ బలం పెరుగుతుంది అలాంటప్పుడు జనసేన పికప్ అవ్వడం కష్టం. ఇటు వస్తే ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటుయ్ రాయలసీమలో ఆ పార్టీకి ఏ మాత్రం బలం లేదు. ఇటీవల వచ్చిన సర్వేలో సీమలో పార్టీకి ఏ మాత్రం బలం లేదని తేలిపోయింది. చిత్తూరు జిల్లాలో తిరుపతి, అనంతపురంలో అనంతపురం, కర్నూలు జిల్లాలో కర్నూలు నియోజకవర్గంలోనే జనసేనకు కాస్త బలం ఉందని తేలింది. అంటే సీమలో 52 స్థానాలు ఉంటే కేవలం మూడు స్థానాల్లో జనసేనకు బలం ఉంది. అది కూడా గెలిచే బలం కాదు.
అలాంటప్పుడు రాష్ట్రంలో జనసేన ఎలా సత్తా చాటగలదు. ఈ సారి ఎన్నికల్లో కూడా జనసేన సత్తా చాటలేదని అర్ధమవుతుంది. గట్టిగా చూసుకుంటే ఓ ఐదారు సీట్లు మాత్రమే గెలుచుకునేలా ఉంది. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే జనసేన కాస్త ఎక్కువ సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. మరి జనసేన ఎప్పుడు పుంజుకుంటుందో చూడాలి.