పవన్ కళ్యాణ్ చుట్టూ ఇంట్రెస్టింగ్ చర్చ.. ఆ వ్యాఖ్యలు వెనుక పరమార్థం ఏంటో..

-

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా సంచలనంగానే ఉంటాయి.. ఆయన అభిమానులు ఆ వ్యాఖ్యలను ట్రోల్స్ చేస్తూ ఉంటారు.. ఇటీవల పవన్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో పాటు పలు ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ సినిమాలకి గుడ్ బై చెప్తారని చర్చ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది..

ఇటీవల జరిగిన ఓ గ్రామ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం తాను కూలీగా మారతానని.. సమాజమే ముఖ్యమన్న అయన ..సినిమాల కంటే దేశం ముఖ్యమంటూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. ఇదే సమయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు సైతం తీసుకుంటానంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీని చుట్టూ రాజకీయ చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి.. సినిమాలు మానేస్తానని తను నేరుగా ఎక్కడా చెప్పకపోయినప్పటికీ.. కఠినమైన నిర్ణయాలు అంటే సినిమాలకి గుడ్ బై చెబుతారనే కోణంలో ప్రచారం నడుస్తోంది..

Pawan Kalyan left Bangalore

ఒక ప్రాజెక్టుకి కమిట్మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఎన్నికల సమయం నుంచి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రజాసేవలో ఆయన నిమగ్నమయ్యారు.. దాదాపు నాలుగు ఐదు నెలల నుంచి ఆయన సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కనీసం హైదరాబాద్ కు వెళ్లిన సందర్భాలు కూడా లేవు.. ఈ క్రమంలో పవన్ చేసిన ఈ కామెంట్స్ పై విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి.. సినిమాలకి ఆయన గుడ్ బై చెప్తారో లేదో క్లారిటీ లేదు గాని సోషల్ మీడియాలో మాత్రం.. గుడ్ బై చెప్పేసినట్టే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version