తెలంగాణలో మత్తుపదార్థాల సరఫరా, వినియోగంపై రాష్ట్ర పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడిక్కకడ తనిఖీలు చేపడుతూ డ్రగ్స్ వాడుతున్న, సరఫరా చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఆకస్మిక దాడులు చేస్తూ పబ్బులు, బార్ల యజమానులకు దడ పుట్టిస్తున్నారు. ఇక సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తూ డ్రగ్స్ సరఫరాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. నగరంలోని బోయిన్‌పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను సీజ్ చేశారు. రూ.8.5 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, 3 సెల్‌ఫోన్ల్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు రాజేంద్రనగర్ పోలీసులు 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌ను సీజ్ చేశారు. వీటిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. ఈ ఘటనకు సంబంధించి నైజీరియాకు చెందిన మహిళను అరెస్టు చేశారు.