పవన్ కళ్యాణ్ మహా పాదయాత్ర…!!! చరిత్ర సృష్టిస్తాడా…???

-

పవన్ కళ్యాణ్ త్వరలో మహా పాదయాత్ర చేపట్టబోతున్నారా, గతంలో పాదయాత్రలు చేసిన రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీరందరికంటే కూడా హిస్టరీ క్రియేట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడా అంటే అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పాదయత్రకి సిద్ధం అవుతున్నాడట. ఏపీలో అధికారంలోకి రావాలంటే తప్పకుండా పాదయాత్ర చేయాల్సిందే అనే పరిస్థితికి పవన్ కళ్యాణ్ వచ్చేశాడట.ఇప్పటివరకు పాదయాత్రలు చేసిన మూడు రాజకీయ పార్టీలు అఖండ మెజారిటీతో గెలుపొందిన విషయం విధితమే. ఈ విషయంపైనే తాజాగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది.

గడిచిన ఎన్నికల ముందు జగన్ దాదాపు 18 నెలల పాటు 134 నియోజకవర్గాలలో 3600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి సక్సెస్స్ అయ్యారని మనం 3 ఏళ్ళ ముందు నుంచీ పాదయాత్ర చేసుకుంటూ ప్రజలలో ఉంటే తప్పకుండా అధికారంలోకి వస్తామని కొందరు నేతలు పవన్ వద్ద ప్రస్తావించారట.గతంలో మన పార్టీ నేతలు ప్రజలలోకి వెళ్లకపోవడం వలనే తీవ్రంగా నష్టపోయామని మనం ఇప్పటినుంచే పాదయాత్ర మొదలు పెడితే గ్రామాలలో సైతం పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తామని తెలిపారట.

పవన్ కళ్యాణ్ కూడా గతంలో జగన్ పాదయాత్ర మెచ్చుకుంటూ తాను కూడా పాదయాత్ర చేపట్టాలని అనుకున్న విషయాన్ని గుర్తు చేశారట. అయితే పవన్ కళ్యాణ్ ఈ పాదయాత్ర విషయంలో పక్కా ప్రణాళికతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే పాదయాత్ర చేపట్టాల్సిందేనని పవన్ పార్టీ కీలక నేతలతో అన్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ పార్టీలో ఓ ముఖ్య నేత మాత్రం ఇప్పుడే పాదయాత్ర మొదలు పెడితే ఎన్నికల సమయానికి పార్టీకి ఉన్న క్రేజ్ తగ్గిపోతుందని వద్దని వారిస్తున్నారట. అంతేకాదు ఈ పాదయాత్ర అసలు కలిసి రాదని, మనం ప్రజలలో పాజిటివ్ కంటే కూడా అధికారం కోసమే ఈ యాత్ర చేపడుతున్నారు అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధినేతకి సలహాలు ఇస్తున్నారట.ఒకవేళ పవన్ కళ్యాణ్ యాత్రకు సంసిద్ధమైతే ఫిబ్రవరి నుంచీ యాత్ర చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.

అయితే మొత్తం 175 నియోజకవర్గాలలో పవన్ పూర్తిస్థాయిలో పాదయాత్ర చేపడుతారని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఒకవేళ ఈ సుదీర్ఘ యాత్ర దిగ్విజయంగా చేపడితే భారీ మెజారిటీతో జనసేన అధికారంలోకి వస్తుందని అంచనాలు వేస్తున్నారు పార్టీ సీనియర్ నేతలు. మరి పవన్ యాత్రకి అడుగు పడుతుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version