జగన్ ముందు జాగ్రత్త ని దేశం మొత్తం మెచ్చుకుంటోంది .. పర్ఫెక్ట్ అసలు !

-

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కరోనా వైరస్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు దేశ స్థాయిలోనే ప్రభావితం గా మారుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా కరోనా వైరస్ చాలా కంట్రోల్ లో ఉంది. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో 40 కి పైగా కేసులు ఉండగా కర్ణాటకలో నలభై నాలుగు కేసులు, తమిళనాడు రాష్ట్రంలో 19 కేసులు అదేవిధంగా ఒడిషా రాష్ట్రంలో రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా కంట్రోల్ అవ్వటానికి కారణం జగన్ ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ.ఎక్కువగా ఈ వైరస్ విదేశాల నుండి వచ్చిన వారి వల్ల దేశంలో వ్యాప్తి చెందడంతో..అందరికంటే ముందుగానే వైయస్ జగన్ జాగ్రత్తలు తీసుకుని వెంటనే గ్రామ సచివాలయం మరియు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చినవారి వివరాలన్నీ పక్కాగా సేకరించడంతో పాటు, వారిని పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు. అదే టైమ్ లో ఇంటి నుండి బయటకు రాకూడదని, 14 రోజులపాటు ఇంటికే పరిమితం కావాలి అంటూ చాలా సీరియస్ గా హెచ్చరికలు జారీ చేసి వాళ్లకు సంబంధించి హెల్త్ కండిషన్ ఏరోజుకారోజు జగన్ సర్కార్ తీసుకోవటంతో..చాలావరకు ఈ వైరస్ కంట్రోల్ అయిందని అంటున్నారు.

 

దీంతో దేశవ్యాప్తంగా జగన్ ప్రత్యేకంగా పరిపాలనలోకి తీసుకువచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పై పొగడ్తల వర్షం కురుస్తోంది. దేశం మొత్తం మెచ్చుకుంటోంది, పర్ఫెక్ట్ అసలు జగన్ ప్లానింగ్ అదిరిపోయింది ఇకముందు జాగ్రత్తగా ఈ విధంగానే వ్యవహరిస్తే వైరస్ ప్రభావం ఏపీలో ఉండదని దేశ స్థాయిలో రాజకీయ నేతలు అంటున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version