ఢిల్లీ వేదికగా జరుగుతున్న సీఏఏ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మొదటిసారిగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అందులో.. ప్రశాంతంగా ఉండాలని ఢిల్లీ ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు. ‘శాంతి మరియు సామరస్యం మనకు ప్రధానమైనవి అన్ని సమయాల్లో శాంతి మరియు సోదరత్వాన్ని కాపాడుకోవాలని నా సోదరీమణులు మరియు ఢిల్లీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రశాంతతో ఉండటం చాలా ముఖ్యం.. సాధారణ స్థితి త్వరగా పునరుద్ధరించబడుతుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై విస్తృతమైన సమీక్ష జరిగింది.
పోలీసులు మరియు ఇతర ఏజెన్సీలు శాంతి మరియు సాధారణ స్థితి కోసం కృషి చేస్తున్నారు’ అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా ఈశాన్య ఢిల్లీలో మూడు రోజుల హింసాకాండ నేపథ్యంలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ హింస ఆగడం లేదు. రాళ్ల దాడితో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ రోజు చెలరేగిన హింసలో ఓ నిఘా అధికారి కూడా మృతి చెందడం కలకలం రేపుతోంది.
Had an extensive review on the situation prevailing in various parts of Delhi. Police and other agencies are working on the ground to ensure peace and normalcy.
— Narendra Modi (@narendramodi) February 26, 2020