పేకాట పాలిటిక్స్… అంతా అదే బ్యాచ్..!

-

తెలంగాణ రాజకీయాలని ఇప్పుడు పేకాట అంశం బాగా కుదిపేస్తుంది…మంత్రులు పేకాట ఆడుతున్నారనే విమర్శలు టీఆర్ఎస్‌కు బాగా ఇబ్బందిగా మారాయి. అసలు పేకాట అంటే ఏపీలో ఎక్కువ జరుగుతుందనుకునే వారు…కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ పేకాట బాగా ఎక్కువైందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మంత్రులే స్వయంగా పేకాట ఆడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

ఇటీవల అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనని కాంట్రాక్టర్ అన్నారని చెప్పి రాజగోపాల్ మాట్లాడుతూ…మంత్రి తలసాని పేకాట ఆడతారని విమర్శలు గుప్పించారు..అయితే ఈ విమర్శలపై తలసాని, ఇతర టీఆర్ఎస్ మంత్రులు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ పేకాట అనే అంశం మాత్రం బాగా హైలైట్ అయింది..సరే ఈ అంశం అంతటితో ఆగిపోయిందా? అంటే అబ్బే లేదనే చెప్పాలి.

తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…పేకాట ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది…దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి..కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్…ఎర్రబెల్లి పేకాట ఆడుతున్న ఫోటోని మీడియాకు విడుదల చేశారు. గతంలో గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ నిషేధిత పదార్థాలని బహిరంగ ప్రదేశాల్లో తింటూ మీడియాకి కనిపించిన విషయాన్ని శ్రావణ్ గుర్తు చేశారు.

అసలు పొగాకు పదార్థాలని బ్యాన్ చేస్తే….మంత్రులకు అవి ఎక్కడ దొరికాయని ప్రశ్నించారు. ఇలా నిషేధిత పదార్థాలు, పేకాట ఆడుతున్న మంత్రులని వెంటనే బర్తరఫ్ చేయాలని, వారిని తక్షణమే మంత్రివర్గం నుంచి తప్పించాలని, పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విమర్శలకు టీఆర్ఎస్ కూడా కౌంటర్లు ఇస్తుంది..కాకపోతే ఈ పేకాట అంశం టీఆర్ఎస్‌కు బాగా నెగిటివ్ అయిపోయింది…ఈ అంశాన్ని ప్రతిపక్షాలు మరింత హైలైట్ చేసేలా ఉన్నాయి..చూడాలి మరి ఈ పేకాట పాలిటిక్స్ ఎంతవరకు వెళ్తాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version