బీజేపీ బుల్డోజర్ల భాష వాడుతూ… ప్రజల్ని తొక్కించాలని చూస్తోంది: బాల్క సుమన్

-

బీజేపీ నేతలు ఇందిరా పార్క్ దీక్షలో మాపై విమర్శలు చేయడం అర్థరహితం అని.. ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఒక్క తెలంగాణలో జరిగినట్లు బీజేపీ నేతలు నీతులు చెబుతున్నారని టీఆర్ఎస్ నేత, విప్ బాల్క సుమన్ విమర్శించారు. బీజేపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ బుల్డోజర్ల భాష వాడుతూ… తెలంగాణ పల్లెల్లో విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. తెలంగాణ ప్రజలను చంపేందుకు బుల్డోజర్ల భాష వాడుతుందని ఆయన విమర్శించారు. మేము మిషన్ కాకతీయ ద్వారా కట్టిన చెరువులను, మేము కట్టిన ప్రాజెక్టులను కూల్చడానికి బీజేపీ బుల్డోజర్లు తెస్తుందా.. అంటూ ప్రశ్నించారు. బీజేపీ దమ్ముంటే కేంద్రం నుంచి 2 కోట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కండకావడంతో సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని.. మీరు మా సీఎం కేసీఆర్ ని తిడితే మేం కూడా మీ పీఏం మోదీ, హోంమంత్రి అమిత్ షాను కూడా అసభ్యంగా తిట్టగటమని బాల్క సుమన్ అన్నారు. మోదీ, అమిత్ షాను చూస్తే తెలంగాణ బీజేపీ నేతల లాగులు తడుస్తాయంటూ.. ఎద్దేవా చేశారు. ఎందుకు విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version