చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ… పవన్ను తొక్కేసే కుట్ర.. రాజకీయ వర్గాల్లో చర్చ

-

ఎన్నికల వేళ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు వినిపిస్తే చాలు రాజకీయాల్లో అలజడి రేగుతోంది. అతను ఎక్కడ ఏ పార్టీ నేతలతో కనిపించినా మిగతా పార్టీల నేతలకు గుబులు మొదలవుతోంది. సరిగ్గా అలాంటి గందరగోళాన్నీ సృష్టించడానికి చంద్రబాబు మరోసారి ప్రయత్నం చేశారు. ఏపీలో మళ్లీ వైసీపీ వైపే ప్రజలు ఉండటంతో జగన్ని ఎలాగూ ఓడించలేము అని నిర్ధారించుకున్నారు చంద్రబాబు.అయితే ప్రజలను అయోమయానికి గురిచేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం.ఈ నేపథ్యంలో ఉన్నఫలంగా ప్రశాంత్ కిషోర్ ఏపీకి రావడం,లోకేష్ వెంట బెట్టుకుని చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లడం,ఆయనతో సుదీర్ఘంగా భేటీ కావడం అంతా చూస్తుండగానే జరిగిపోయాయి.దీంతో ఏపీ రాజకీయాలపై ప్రజల దృష్టి ని మరల్చడానికి చంద్రబాబు గొప్ప ప్రయత్నమే చేశాడని చెప్పాలి. రానున్న ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పనిచేస్తూన్నారు అనే సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు చంద్రబాబు భలే ట్రై చేసారని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. ఓ శుభకార్యం నిమిత్తం విజయవాడకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ ని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లినట్లు నానా హడావిడి చేయడం ఓటర్లను మభ్యపెట్టేందుకేనని చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ పార్టీ పెట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.ఇందుకోసం రెండేళ్ల క్రితమే ఆయన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. మరో రాజకీయ పార్టీకి పనిచేయడం లేదని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఏదో పని మీద వచ్చిన ప్రశాంత్ ని తన అవసరాల కోసం వాడేసుకుంటున్న బిల్డప్ ఇచ్చారు చంద్రబాబు,లోకేష్. అసలు వాళ్ళు ఇలా చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే….పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అని బహిరంగంగా నోరు జారారు లోకేష్. అలాంటి కాన్సెప్ట్ తమ వద్ద లేదని వాగేశాడు. ఈ మాటలతో జనసేన గ్రౌండ్ క్యాడర్ లో టీడీపీ పొత్తుపై మళ్లీ వ్యతిరేకత వచ్చేసింది.దీనిని డైవర్ట్ చేసే పనిలో భాగంగానే వ్యక్తిగత అవసరాల కోసం వచ్చిన ప్రశాంత్ కిషోర్ తమ కోసమే వచ్చాడని ప్రచారం చేయించుకున్నారు చంద్రబాబు.

పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు అంటే జనసేన కేడర్ జీర్ణించుకోలేక పోతోంది.వాస్తవానికి చంద్రబాబే సీఎం అభ్యర్థి కానీ అది ప్రజలకు ఎన్నికలు తర్వాతే చెప్పే ప్లాన్ లో ఉన్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కానీ జనసేన క్యాడర్ మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండాలని కోరుతున్నారు. కాగా లోకేష్ నోరు జారడంతో జనసేన కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం పనిచేశాం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అంటే జీర్ణించకోలేక పోతున్నారు.దీనిని సర్దుకునే పరిస్దితుల్లో ప్రశాంత్ కిషోర్ ను దింపి టాపిక్ డైవర్ట్ చేశారు చంద్రబాబు. మొత్తానికి భలే మాయగాడివయ్యా అని చంద్రబాబుపై సెటైర్లు పేలుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రాబిన్ శర్మ టీమ్ కూడా టీడీపీ రాత మార్చలేమని ఏనాడో తేల్చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ 30 సీట్లు కూడా గెలవలేదని ఎప్పుడో చెప్పేసారు. అయినప్పటికి చంద్రబాబు ఏదో ఒక విధముగా ప్రజలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version