ప్ర‌ధాని మోడి వివాదాలు సృష్టిస్తున్నారు : కే కేశ‌వ‌రావు

-

ప్ర‌ధాని మోడి పార్ల‌మెంటు లో వివాద‌లు సృష్టిస్తున్నార‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోడి చేసిన వ్యాఖ్య‌లకు నిర‌స‌నకు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. కోట్లాది తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల పోరాటాన్ని ప్ర‌ధాని మోడి అవ‌మానించాని ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధానిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పార్ల‌మెంట్ స్పీక‌ర్ కు ప్రివిలేజ్ నోటిసు ఇచ్చామ‌ని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.

ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర అభ్యంత‌రంగా ఉన్నాయ‌ని.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అగౌర‌వ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని టీఆర్ఎస్ ఎంపీ కే. కేశ‌వ రావు అన్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల మ‌ధ్య వివాద‌లు సృష్టించేలా ప్ర‌ధాని మోడీ వ్య‌వ‌హరిస్తున్నార‌ని ఆరోపించారు. కాగ ప్రివిలేజ్ నోటిస్ పై స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునేంత వ‌ర‌కు లోక్ స‌భ ను బ‌హిస్క‌రిస్తున్న‌ట్టు ఎంపీలు తెలిపారు. అలాగే పార్లమెంటు లో బీజేపీ యే స‌భ నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని ఆరోపించారు. అలాగే పార్ల‌మెంటు ప్రొసీడింగ్స్ ను ప్ర‌శ్నించే హ‌క్కు ప్ర‌ధానికి లేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version