గ‌న్ పార్క్ వ‌ద్ద ప్రొఫెసర్ కోదండ‌రాం అరెస్ట్…!

-

తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించింది.. కేబినెట్‌లో కూడా తీర్మానం చేశారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియెట్‌ను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే తెలంగాణ సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని.. పదుల సంఖ్యలో పిటిషన్లు రావడంతో విచారణ జరిపిన కోర్టు వాదనల్ని సుదీర్ఘంగా వినింది. అందరి వాదనలు విన్న కోర్టు కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ‌లో ఓవైపు క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తుంటే స‌చివాల‌యం భ‌వ‌నాల కూల్చివేత‌పై ప్ర‌తిక్షాలు నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చాయి. గ‌న్ పార్క్ లోని అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద నిర‌స‌న తెలపాల‌ని కాంగ్రెస్, సీపీఐ, జ‌న‌స‌మితి పార్టీలు పిలుపునివ్వ‌టంతో గ‌న్ పార్క్ వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అయితే గ‌న్ పార్క్ వ‌ద్దకు చేరుకున్న జ‌న స‌మితి అధ్య‌క్షుడు ప్రొ. కోదండ‌రాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ‌న్ పార్క్ వ‌ద్ద ఆందోళ‌న‌కు ఎలాంటి అనుమ‌తి లేద‌ని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news