రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా స్పందించారు. ‘ఎమ్మెల్యేల సమావేశం అయ్యింది వాస్తవం.
నేను ఏ ఫైల్ క్లియర్ చేయమని అడగలేదు. ఏ ఫైల్ క్లియర్ చేయమని అడిగానో రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి చెప్పాలి.
ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. రేపు దీపాదాస్ మున్షిని కలిసిన అన్ని వివరాలు వెల్లడిస్తా.అధిష్టానాన్ని కలిసి అన్ని విషయాలు చర్చిస్తా’ అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టంచేశారు. కాగా, మహాబూబ్ నగర్ జిల్లా మంత్రికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి అసలు పడటం లేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య అంతరం పెరగడం వల్లే రహస్యంగా ఎమ్మెల్యేలు భేటీ కావాల్సి వచ్చినట్లు కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక వెళ్లినట్లు సమాచారం.