కమలంలో రఘునందన్ సైలెంట్..బిగ్ ప్లాన్ ఉందా?

-

తెలంగాణకు కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించే ముందు బి‌జే‌పిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాను కూడా అధ్యక్షుడు రేసులో ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దుబ్బాకలో తన సొంత బలంతో గెలిచారని, అక్కడ బి‌జే‌పికి పడే ఓట్లు తక్కువే అన్నట్లు మాట్లాడారు. అలాగే బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బండి కళ్ళు నెత్తికెక్కాయని, ఆయనకు అహంకారం అని, ఎవరిని కలుపుకుని వెళ్ళడం లేదని ఫైర్ అయ్యారు. అలాగే వంద కోట్లు ఖర్చు పెట్టిన మునుగోడులో పార్టీ అభ్యర్ధి గెలవలేదని, పుస్తెలు అమ్మి ఎన్నికలు పోటీ చేసిన అని చెప్పిన బండికి వంద కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని ఆరోపించారు. జాతీయ నేతలు తరుణ్ చుగ్, సునిల్ లతో ఓట్లు రావని, ఈటల, రఘునందన్ లతోనే ఓట్లు వస్తాయని అప్పటిలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈయనపై బి‌జే‌పి అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ప్రచారం సాగింది. కానీ అదేమీ జరగలేదు.

ఇక కొత్త అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి వచ్చాక..రఘు బి‌జే‌పిలో యాక్టివ్ గా లేరు. టీవీ డిబేట్లలో కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో రఘు బి‌జే‌పికి దూరమవుతున్నారనే టాక్ మొదలైంది. పైగా చాలామందికి జాతీయ నాయకత్వం పదవులు ఇచ్చింది..కానీ రఘుకు ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఇప్పటికీ ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుని పార్టీ మారిపోతారా? అనే టాక్ వస్తుంది. చూడాలి రఘు చివరికి ఏం చేస్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version