2024 లో జరగనున్న ఎన్నికలలో బిజెపిని ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాడడానికి సిద్ధమయ్యాయి. బెంగళూరు వేదికగా ప్రతిపక్ష నేతల భేటీ మంగళవారం కొనసాగుతోంది. సాంఘిక న్యాయం, సమ్మేలిక వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. అయితే ఈ సమావేశంలో విపక్షాలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
విపక్షాల కూటమికి I-N-D-I-A అనే పేరును నిర్ణయించాయి. INDIA అంటే.. భారత జాతీయ ప్రజాస్వామ్య సమ్మేళిత కూటమి అనే నామకరణం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే కూటమి అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. INDIA అనే నామకరణం పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.