ఈటల రాజేందర్ వ్యవహారం రాకముందు తెలంగాణ మంత్రులకు పెద్దగా స్వేఛ్చ లేదనే చెప్పాలి. వారంతా కేవలం తమ నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. వారి పక్కనున్న నియోజకవర్గాలకు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉండేవి. మంత్రి హరీశ్‌రావు కూడా కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
కానీ ఎప్పుడైతే ఈటల రాజేందర్ వ్యవహారం తెరమీదకు వచ్చిందో అప్పటి నుంచి టీఆర్ ఎస్‌లో పరిస్థితులు మారిపోయాయి. ఈటల రాజేందర్ టీఆర్ ఎస్‌లో మంత్రులకు స్వేఛ్చ లేదని చెప్పినప్పటి నుంచి సీఎం కేసీఆర్, కేటీఆర్ అలర్ట్ అయ్యారు.
మంత్రులకు కొంత స్వేఛ్చ ఇచ్చారు. వారిని రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపనలకు వెళ్లేలా చూస్తున్నారు. వారి డిపార్టుమెంట్లకు సంబంధించిన పనులు ఏ నియోజకవర్గంలో జరిగినా వెళ్లి పాల్గొంటున్నారు. కొందరు మంత్రులను కేటీఆర్ దగ్గరుండి తన వెంట తీసుకెళ్లి మరీ శంకుస్థాపనలు, ఓపెనింగ్‌లు చేయిస్తున్నారు. మొత్తానికి ఈటల రాజేందర్ వ్యవహారం మంత్రులకు కలిసి వచ్చిందనే చెప్పాలి.