మ‌ళ్లీ తెర పైకి ర‌ఫెల్ ర‌గ‌డ ! రూ.65 కోట్లు లంచం

-

ఫ్రాన్స్ దేశంతో ర‌క్ష‌ణ ప‌రంగా ప‌లు కీల‌క ఒప్పందాలు భార‌త‌దేశం చేసుకుంది. అందులో ముఖ్య మైంది ర‌ఫెల్ యుద్ధ విమానాలు. ఇప్ప‌టికే ప‌లు ర‌ఫెల్ యుద్ధ విమానాలు భార‌త్ కు చేరుకున్నాయి. ర‌ఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు సమ‌యంలో అవినీతి జ‌రిగింద‌ని అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తాజాగా మ‌రో సారి కూడా ర‌ఫెల్ యుద్ధ విమానాల కు సంబంధించి అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఈ విష‌యాన్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రాన్స్ జ‌ర్న‌ల్ త‌న మీడియా పార్ట్ లో క‌థ‌నం ద్వారా తెలిపింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన డ‌సో ఏవియేష‌న్ మ‌ధ్య వ‌ర్తి సుషేన్ గుప్తాకు ర‌ఫెల్ విష‌యం లో దాదాపు రూ. 65 కోట్లు అంద‌యాని రాసుకు వ‌చ్చింది. ఈ విష‌యం పై త‌మ ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నా.. భార‌త సీబీఐ, ఈడీ సంస్థ‌లు ద‌ర్య‌ప్తు చేయ‌వ‌ద్ద‌ని నిర్ణయించాయ‌ని త‌మ క‌థనం లో తెలిపింది. దీంతో మ‌రో సారి ర‌ఫెల్ ర‌గ‌డ మొద‌లైంది. దీని పై ఇప్ప‌టి వ‌ర‌కు డ‌సో ఏవియేష‌న్ గానీ భార‌త ర‌క్ష‌ణ శాఖ గాని స్పందించ‌లేదు. దీంతో ప్ర‌తి ప‌క్ష‌నేతుల ఈ విష‌యం పై బ‌గ్గు మంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news