దేశంలో బ్యాంకులు పేదల పట్ల ఒకలాగా పెద్దల పట్ల మరొక లాగా వ్యవహరిస్తున్నాయి. మామూలుగా పేదవాడు రుణం కోసం బ్యాంకు కి వెళ్తే ఆ రూల్స్ ఈ రూల్స్ అంటూ ముప్పు తిప్పలు పెట్టి రుణాలు ఇస్తాయి. పేదవాడు రుణం కట్టడంలో కొద్దిగా ఆలస్యం అయినా అర్థం పర్థం లేని రూల్స్ తెరపైకి తెచ్చి వడ్డీల మీద వడ్డీలు బాదుతుంటాయి.
వాళ్లు చేసిన అప్పులు తిరిగి వసూలు చేయలేమని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లారితే కోట్ల రూపాయల కారులో తిరుగుతూ ఉండేవారికి ఈ విధంగా బ్యాంకులు సహకరించడం పట్ల సామాన్యులు మండిపడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల EMI లు సామాన్యుడు కట్టుకోలేను మొర్రో అంటే ఒకే అని చెప్పి ఆ మూడు నెలల వాయిదా మొత్తాన్ని ప్రిన్సిపాల్ అమౌంట్ కి కలిపేసి వాసులు చేయాలనీ సూచించిన ఆర్బీఐ పేదల ని పక్కన పెట్టి, పెద్దలకి ఈ విధంగా సహకరించడం అమానుషమని దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.