ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల కు రావలన్న టీడీపీ నేత అచ్చెన్నాయడి కామెంట్స్ కు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చాడు. ముందు టీడీపీ కి ఉన్న 19 మంది ఎమ్మెల్యే లను రాజీనామా చేయించి మళ్లి గెలిచి చూపించాలని సవాల్ విసిరాడు. ప్రస్తుతం ఉన్న సమయంలో 19 టీడీపీ ఎమ్మెల్యే లు రాజీనామా చేస్తే వాళ్లు తిరిగి గెలిచే సంఖ్య సింగిల్ డిజిట్ కూడా రాదని అన్నారు. ఉంటుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఒకే వేల టీడీపీ సింగిల్ డిజిట్ కు మంచి వస్తే తాము రాజీనామా చేస్తామని ప్రకటించారు. అలాగే తమను రాజీనామా చేయాలని అంటున్నారు.. మరి ఈ ఎన్నికల్లో ఎం చేశారని ప్రశ్నించారు. టీడీపీ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మర్చి పోయారని అన్నారు. తమ ప్రభుత్వ పథకాలే తమను గెలిపించాయని అన్నారు. అలాగే ఎన్నికల లో ఓడినా.. చంద్రబాబు కు ఇంకా బుద్ది రావడం లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.