బీఆర్ఎస్-బీజేపీ పోరులో రేవంత్ కొత్త ఎత్తు.!

-

తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహించకుండా..తమదైన శైలిలో ముందుకెళ్లెలా ప్లాన్ చేసుకుంటుంది. అసలు బి‌ఆర్‌ఎస్ –బి‌జే‌పి పోరులో కాంగ్రెస్ వెనుకబడిపోతుంది. కాంగ్రెస్ ఏ కార్యక్రమం చేసిన హైలైట్ కావడం లేదు. వాస్తవానికి తాజాగా కరీంనగర్ లో భారీ సభ జరిగింది..కానీ ఓ వైపు ఢిల్లీకి వెళ్ళి కవిత దీక్ష అంటూ హడావిడి చేయడం..మరో వైపు ఈడీ విచారణ…ఇటు తెలంగాణలో కవితకు పోటీగా బి‌జే‌పి మహిళా నేతలు దీక్షకు రెడీ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సభ పెద్దగా హైలైట్ కాలేదు.

ఇక మీడియా అటెన్షన్ కూడా బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్యే ఉంది. అయితే ఆ రెండు పార్టీలకు సైలెంట్ గా చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. రెండు పార్టీలు రాజకీయ యుద్ధానికి దిగుతున్న నేపథ్యంలో సైలెంట్ గా జనం మద్ధతు పెంచుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. వాస్తనికి తాజాగా కరీంనగర్ లో జరిగిన సభకు భారీగా జనం వచ్చారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. అయితే ఇక్కడ రేవంత్ వ్యూహాత్మకమైన ప్రకటన చేశారు.

కేసీఆర్‌పై కోపంతో బీజేపీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ మోడల్‌ అంటే తాగుబోతుల తెలంగాణనా? అని ప్రశ్నించిన ఆయన.. బీఆర్‌ఎస్‌ మోడల్‌ అంటే గల్లీ గల్లీకి వైన్స్‌ వస్తుందని విమర్శించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పి ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పేద రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల వరకు వైద్య ఖర్చులు, సిలిండర్‌ 500 రూపాయలకు ఇస్తామని తెలిపారు. ఇన్ని మంచి పనులు చేయాలంటే తమకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని రేవంత్ కోరారు. మరి కాంగ్రెస్ వ్యూహాలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version