మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలు కార్యకర్తలు మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సీఎం కుర్చీలో కూర్చోవడానికి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలే కారణమని చెప్పారు. నాడు కొందరు నాయకులు అమ్ముడు పోయినా కార్యకర్తలు భుజాలపై జెండా మోసి తనని ఎంపీగా గెలిపించాలని గుర్తు చేశారు.
ఒక సైనికుడులా కార్యకర్తలు పని చేశారని దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి అని, మల్కాజ్గిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని అన్నారు. కేసీఆర్ పతనం 2019 మల్కాజ్గిరి పార్లమెంట్ నుండే మొదలైందని అన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం నాలుగు స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదని తెలంగాణ రాష్ట్రమంతా కాంగ్రెస్ గారి విజన మల్కాజ్గిరి లో పార్లమెంట్ పరిధిలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.