రేవంత్‌కు ఆ అవకాశం దక్కనిచ్ఛేలా లేరుగా…!

-

గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన కుటుంబంతో సహ ఢిల్లీకి వెళ్ళి జాతీయ అధ్యక్షరాలు సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో దిగారు. ఇక అక్కడ నుంచి రేవంత్ కు సోనియా పీసీసీ పగ్గాలు అప్పగించడం ఖాయమైందని వార్తలు వచ్చాయి. అటు దీని తర్వాత టీ కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారిపోయాయి.


అయితే రేవంత్ కు పీసీసీ పదవి అప్పగించడం చాలమందికి సీనియర్లకు నచ్చడం లేదు. అందుకే కొందరు సీనియర్లు ఢిల్లీలో మకాం వేసి మరి రేవంత్ కు పీసీసీ పదవి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో ముఖ్యంగా ముందు నుంచి రేవంత్ నాయకత్వం ఇష్టపడని సీనియర్ నేత వీ హనుమంతరావు బహిరంగంగానే వేరే పార్టీ నుచి వచ్చిన వారికి పీసీసీ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఢిల్లీలో మకాం వేసిన పెద్దల్లో వి‌హెచ్ కూడా ఉన్నారంటా. ఆయన అధిష్టానం పెద్ద అహ్మద్ పటేల్ ముందు తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రేవంత్ మొదట బీజేపీ అనుబంధ సంస్థ ఏ‌బి‌వి‌పి లో పని చేశారని, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారని, కొన్నేళ్లు ఆ పార్టీలో ఉండి కాంగ్రెస్ లోకి వచ్చారని, ఇలా వచ్చిన వారికి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ లో చాలామంది సీనియర్లు ఉన్నారని వాళ్ళని కాదని రేవంత్ కు ఇవ్వడం సరికాదని వాదించినట్లు సమాచారం.  మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ కు పీసీసీ పగ్గాలు దక్కకుండా చేసేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన టీ పెద్దలు రేవంత్ కు కాకుండా జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిల్లో ఒకరికి పీసీసీ ఇవ్వాలని అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ను తొక్కేందుకు వీరు ఎంత కుట్ర చేస్తున్నా కానీ అధిష్టానం మాత్రం రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మంచి ఫాలోయింగ్, క్రేజ్, వాక్చాతుర్యం గల రేవంత్ కి ఇస్తేనే టీఆర్ఎస్, బీజేపీలని ధీటుగా ఎదురుకోగలమని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ అధిష్టానం ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news