హుజూరాబాద్ పోరు: రేవంత్ రెడ్డి ఫుల్ క్లారిటీతో ఉన్నారా?

-

తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ), హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో అంతగా దూకుడుగా కనబరుస్తున్నట్లు లేదు. మొదట నుంచి హుజూరాబాద్ ఉపఎన్నికని రేవంత్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా అక్కడ పోరు టీఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగానే జరుగుతుంది. ఇక వారి మధ్యలో కాంగ్రెస్ గెలవడం కష్టమని, అందుకే ముందే రేవంత్ ఆ ఉపఎన్నికని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే ఇదే అంశంలో లాజికల్‌గా రేవంత్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా ఎన్నికలు అంటే రేవంత్ ప్రచారం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పీసీసీ కాకముందు ఉప ఎన్నికల జరిగే ప్రతి నియోజకవర్గంలో రేవంత్ ప్రచారాన్ని హోరెత్తించేవారు. మరి పీసీసీ అయ్యాక తొలి ఉపఎన్నిక హుజూరాబాద్ రూపంలో వచ్చింది. అయితే పీసీసీ అయ్యాక కూడా ఈ ఉపఎన్నికపై రేవంత్ పెద్దగా దృష్టి పెట్టడం లేదు.

ఎందుకంటే ఇక్కడ మానసికంగా… విజయం విషయంలో కాస్త లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే బాగా హడావిడిగా ప్రచారం చేసి ఓడిపోవడం కంటే, పెద్దగా పట్టించుకోకుండా ఓడిపోయామనే విషయం హైలైట్ అయితే, రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. అందుకే ఇప్పటినుంచే టీఆర్ఎస్, బీజేపీలు మాదిరిగా హుజూరాబాద్ ‌లో కాంగ్రెస్ యాక్టివ్‌గా లేదు. ఇదే సమయంలో హుజూరాబాద్‌లో పోటీ చేసే అభ్యర్ధిని కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు.

అయితే ఇప్పుడు ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్ధే 2023లో కూడా పోటీ చేస్తారని రేవంత్ చెబుతున్నారు. అంటే ఇప్పుడు విజయానికి ఇబ్బంది అయితే, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆ అభ్యర్ధికే సీటు ఇచ్చి న్యాయం చేయాలని రేవంత్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే హుజూరాబాద్ ఉపపోరు విషయంలో రేవంత్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version