రేవంత్ పాదయాత్రకి ముహూర్తం అప్పుడేనా?

-

పాదయాత్ర..ఈ రాజకీయ నాయకుడి జీవితంలోనైనా కీలక ఘట్టం. పాదయాత్ర నాయకులని ప్రజలకు మరింత దగ్గర చేస్తుంది. అందుకే పాదయాత్రలు చేసే నాయకులకు కాస్త ఫాలోయింగ్ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన నేతలు మంచి విజయాలే అందుకున్నారు. వైఎస్సార్, చంద్రబాబు, జగన్‌లు అందుకు ఉదాహరణ. అయితే ఇప్పుడు తెలంగాణలో ఈ పాదయాత్ర ట్రెండ్ కాస్త ఎక్కువగా ఉంది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…విడతల వారీగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదట విడత పాదయాత్రని పూర్తి చేసుకున్న బండి..త్వరలోనే రెండో విడత పాదయాత్రని మొదలుపెట్టనున్నారు. ఇటు వైఎస్సార్టీపీ అనే పార్టీ పెట్టి షర్మిల సైతం పాదయాత్ర చేస్తున్నారు. అయితే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తారని ప్రచారం జరిగింది.

కానీ ఆయన ఇంకా పాదయాత్ర మొదలుపెట్టలేదు. పార్టీలో ఉన్న కొన్ని అంతర్గత సమస్యల వల్లే పాదయాత్ర చేయలేదని తెలుస్తోంది. అయితే రేవంత్ పార్టీ పగ్గాలు చేపట్టాకే కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చింది. ఆయన చాలావరకు పార్టీని రేసులోకి తీసుకొచ్చారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తే ఇంకా పార్టీకి మైలేజ్ వస్తుంది. అందుకే రేవంత్ సైతం పాదయాత్ర చేయడానికి మొగ్గు చూపుతున్నారు గానీ…కొందరు సీనియర్లు దానికి అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది…ఈలోపు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి…పాదయాత్ర చేయాలని రేవంత్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఎన్నికలకు ముందు ఏడాది పాదయాత్ర చేస్తే పార్టీకి ఇంకా ప్లస్ అవుతుందనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే వచ్చే ఏడాది అయినా పాదయాత్రతో జనంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పాదయాత్ర చేస్తేనే కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ పెరుగుతుందని చెప్పాలి…అప్పుడు జనంలోకి ఎక్కువ వెళుతుంది. లేదంటే కాంగ్రెస్ పార్టీకి మరోసారి అధికారం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version