ప్లాట్ బయట తెగిపడిన మనిషి చేయి.. లోపలికి వెళ్లిన పోలీసులకు షాక్

-

ప్లాట్ బయట తెగిపడిన మనిషి చేయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్లాట్ లోపలికి వెళ్లి చూసి కంగుతిన్నారు. గాఢ నిద్రలో ఉన్న మహిళ, ఆమె పక్కన మనిషి శరీర భాగాలను చూసి షాక్ తిన్నారు. ఆమె దుస్తులన్నీ రక్తసిక్తమై ఉన్నాయి. ఆ మహిళను ప్రధాన నిందితురాలిగా అనుమానించిన పోలీసులు అరెస్టు చేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో వెలుగు చూసింది.

మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సద్దార్ ప్రాంతంలోని పురాతన అపార్ట్‌మెంట్ బయట మనిషి చేయి భాగం ఉన్నట్లు తెలిపారు. మా బృందం సంఘటన స్థలానికి చేరుకుని ప్లాట్‌ను తెరవగా గాఢ నిద్రలో ఉన్న మహిళ కనిపించింది. ఆమెకు దగ్గరలో ముక్కలు చేసిన కొన్ని శరీర భాగాలు కనిపించాయి. మిగిలిన శరీర భాగాలు ప్లాట్ మొత్తం పడి ఉన్నాయి అని పోలీస్ ఆఫీసర్ జుబేర్ నజీర్ షేక్ తెలిపారు.

45ఏండ్ల మహిళ(పేరును వెల్లడించలేదు)ను ప్రధాన నిందితురాలిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ వారం మొదట్లో ఆ వ్యక్తిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

ఆ మహిళ దుస్తులు రక్తసిక్తమై ఉండటం, శరీర భాగాలను ముక్కలు చేసేందుకు ఉపయోగించిన ఆయుధాలు లభించడంతో ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సంఘటన స్థలంలో శరీర భాగాలను ముక్కలు చేసేందుకు వినియోగించిన పరికరాలు, కత్తి, సుత్తిలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుడు తన భర్త అని, ఆయన పేరు మహమ్మద్ సోహేల్ అని తెలిపిన ఆ మహిళ ఆ తర్వాత మాట మార్చింది. తనకు ఇంకా పెండ్లి కాలేదని పేర్కొన్నది. హత్యకు గురైన వ్యక్తి తనకు వరుసకు బావ అవుతాడని తెలిపింది. ఆ మహిళ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయింది. రసాయన మందుల ప్రభావంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version