Rajinikanth: ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి..ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. అంతే జగన్‌ని గాని, ప్రభుత్వాన్ని గాని ఒక్క మాట అనలేదు. అయినా సరే వైసీపీ నేతలు వరుసపెట్టి రజనీకాంత్‌ని తిడుతున్నారు. ఇప్పుడు ఈ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మరి రజనీకాంత్‌ని అలా తిట్టడం కరెక్టేనా అంటే..మెజారిటీ ప్రజలు కరెక్ట్ కాదనే అంటున్నారు. వైసీపీ నేతల తీరు సరికాదని అంటున్నారు.
ఆఖరికి వైసీపీలోనే కొందరు కార్యకర్తలు..రజనీకాంత్‌ని తిట్టాల్సిన అవసరం ఏముంది అన్నట్లు మాట్లాడుతున్నారు. అయినా సరే వైసీపీ నేతలు ఆగడం లేదు. ఇలా అనవసరంగా రజనీని తిట్టి వైసీపీనే నెగిటివ్ చేసుకుంటుంది. సరే మిగతా నేతలంటే రజనీతో పరిచయం లేదు..కానీ మంత్రి రోజా..హీరోయిన్ గా రజనీకాంత్ తో నటించింది. పైగా తమిళ ఇండస్ట్రీలో పనిచేసింది. ఆమె భర్త సెల్వమణి తమిళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి.
అయినా సరే రోజా లాంటి వారు కూడా రజనీని తిట్టడంపై అటు తమిళ, ఇటు తెలుగు ప్రజలు రోజాపై ఫైర్ అయ్యే పరిస్తితి కనిపిస్తుంది. పదవి కోసం ఆమె.. ఈ విధంగా రజనీని సైతం తిడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు అలా తిట్టడమే రోజాకు పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పటికే రోజా సొంత స్థానం నగరిలో వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ వాళ్ళే ఆమెని వ్యతిరేకించే పరిస్తితి. అలాంటప్పుడు రజనీ లాంటి వారిని తిట్టి మరింత వ్యతిరేకత పెంచుకుంటున్నారు.
నగరిలో మామూలుగానే తమిళ ఓటర్లు ఉంటారు. వారు మొన్నటివరకు రోజాకు మద్ధతు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారు యాంటీగా మారుతున్నారు. రజనీ ఫ్యాన్స్ రోజాపై ఫైర్ అవుతూ..నగరిలో ఓడిస్తామని అంటున్నారు. మొత్తానికి రజనీని తిట్టి రోజా మరింత వ్యతిరేకత తెచ్చుకున్నట్లు కనిపిస్తున్నారు.