సబితా ఇంద్రారెడ్డి వెంటే మేము.. కాంగ్రెస్ కు భారీ షాక్..!

-

నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయం పట్టుకుంది. రోజురోజుకూ తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు ఇది గడ్డు కాలమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీలోనే కాదు.. తెలంగాణలో కూడా రాజకీయాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. ఎండాకాలం వల్ల వచ్చే వేడితో అనుకుంటున్నారా? కాదు.. కాదు.. పార్టీల్లో జరుగుతున్న పరిణామాలతో. ఓవైపు ఏపీలో అధికార పార్టీ టీడీపీకి షాక్ లు ఇస్తూ చాలామంది నేతలంతా వైఎస్సాఆర్సీపీ బాట పడుతున్నారు. అక్కడ జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుండటంతో టీడీపీలో ఉండటం వల్ల ఎటువంటి లాభం లేదనుకొని వైసీపీలో చేరుతున్నారు.

ఇక.. తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే.. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆమె టీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలియడంతో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నేతలు, ఇతర నాయకులు కూడా ఆమె వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె కొడుకు కార్తీక్ రెడ్డితో కలిసి ఆమె త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

అయితే.. సబితతో పాటు ఆమె అనుచరులు, నియోజకవర్గానికి చెందిన కౌన్సిలర్లు, సర్పంచ్ లు, నాయకులు అందరూ ఆమెను కలిసి ఈ విషయమై చర్చించారు. సబిత నిర్ణయాన్ని స్వాగతించి.. తన వెంటే నడుస్తామని హామీ ఇచ్చారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగలనుంది. రంగారెడ్డి జిల్లాలో దాదాపు కాంగ్రెస్ అంతా ఖాళీ కానుంది.

కాగా.. మహేశ్వరం ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలంటే.. మహేశ్వరాన్ని అభివృద్ధి చేయాలంటే అది కేసీఆర్ వల్లే అవుతుందని భావించిన సబిత… టీఆర్ఎస్ లో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న సబితా ఇంద్రా రెడ్డి.. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయం పట్టుకుంది. రోజురోజుకూ తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు ఇది గడ్డు కాలమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే సబితతో పాటు ఆమె కొడుకు కార్తీక్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సర్పంచ్ లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అంతా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version